రియల్ స్టార్ అవార్డ్స్ - యనమల డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నేతృత్వంలో రెండవ వార్షికోత్సవము
హైద్రాబాద్ , విశ్వంభర :-యనమల డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ సీఈవో యనమల రాజు నేతృత్వంలో తన సంస్థలో అత్యధిక ఫ్లాట్లు రీసెల్ చేసిన ప్రతినిధులను రియల్ స్టార్ అవార్డ్స్ రెండవ వార్షికోత్సవము రెడ్ హిల్స్ ఫాప్సీలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మోటివేషనల్ స్పీకర్స్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. లక్ష్మీపురం వేణుగోపాల్ స్పీచ్ లు కార్యక్రమంలో అందర్నీ ఆకర్షించాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు సంస్థ అధినేత ఎనమల రాజు మాట్లాడుతూ యనమల డెవలప్ స్థాపించిన అనతి కాలంలోనే అత్యధిక ప్లాట్లు సంస్థ ప్రతినిధుల సహకారంతో రీసేల్ చేశామని అన్నారు.కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు.సంస్థ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కొనుగోలు చేసినవారికి బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. తక్కువ ధరల్లో ప్లాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. భూమిని నమ్ముకుంటే ఆర్థికంగా ఎదగువచ్చని సకల సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపించే ఏకైక అస్త్రం భూమి అన్నారు.ఎవరైతే తన ప్లాట్లు అమ్ముకోవడం లేదో అని బాధ పడుతున్నారో వారు ప్లాట్ రీసైల్ చేసే భరోసాని రెండు రాష్ట్రాల వారికి కలిగిస్తున్నారని తెలియజేసారు . తక్కువ టైంలో ఎక్కువ లాభాలు కలిగే విధంగా సెక్యూరిటీ నియమాలు ఉండేలా ప్లాట్లు కస్టమర్లకు అందజేస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా షాద్ నగర్ లో బ్రహ్మాండమైన ప్లాట్లు ఉన్నాయి అన్నారు.