ఎమ్మెల్యే మల్ రెడ్డి ని కలిసిన టీజీఎస్పీ  మూడో బెటాలియన్ అధికారులు 

విశ్వంభర, ఇబ్రహీంపట్నం:  తెలంగాణ స్పెషల్ పోలీస్ మూడో బెటాలియన్ అధికారులు, సిబ్బంది ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డిని కలిశారు. బెటాలియన్ కమాండెంట్ సయ్యద్ జమీల్ బాష, అసిస్టెంట్ కమాండెంట్లు ఎం.వీరయ్య, ఆర్.పాండు, వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవాల కోసం ఆగస్టు 3న బెటాలియన్ కు రావాలని ఎమ్మెల్యే ని ఆహ్వానించారు. నాగన్ పల్లి రోడ్డు నుంచి బెటాలియన్ గేటు వరకు హెచ్ఎండీఏ నిధులతో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో నిర్మించిన అప్రోచ్ రోడ్డు పూర్తికాగా ఈ మేరకు వారు తొర్రూర్ లోని క్యాంపు కార్యాలయంలో మల్ రెడ్డి రంగారెడ్డి ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగానే 3వ తేదీన అప్రోచ్ రోడ్డు ప్రారంభోత్సవానికి రావాలని ఎమ్మెల్యేను కోరారు. అలాగే, అదే రోజు నుంచి ఇంటర్నల్ బెటాలియన్ స్పోర్ట్స్ మీట్ జరగనున్నందున ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా హెచ్ఎస్ఏ ఫైల్ అంశాన్ని వారు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. గత డిసెంబర్ లో గ్రేటర్ హైదరాబాద్ పరిధి విస్తరణ నేపథ్యంలో పెరిఫరీ 8 కిలోమీటర్లలోపు తమ బెటాలియన్ ఉన్నందున కలెక్టర్ గారి వద్ద ఉన్న ఇంటి అద్దె పెంపు ఫైల్ ను త్వరగా నోటిఫై చేయించాల్సిందిగా కోరారు. వెంటనే స్పందించిన మల్ రెడ్డి, ఫోన్లో కలెక్టర్ తో చర్చించారు. ఎమ్మెల్యే చొరవ పట్ల బెటాలియన్ అధికారులు, సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్ స్పెక్టర్లు రవీందర్, యుగేందర్, శేఖర్, యూనిట్ వైద్యాధికారి రవి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/officials-of-tgsp-3rd-battalion-who-met-mla-mal-reddy/article-20066

Tags: