బడి పిల్లల భవిష్యత్తుతో ఆటలా..పట్టించుకోని నల్గొండ విద్యా శాఖ అధికారులు

బడి పిల్లల భవిష్యత్తుతో  ఆటలా..పట్టించుకోని నల్గొండ విద్యా శాఖ అధికారులు

  • నల్గొండ జిల్లా , గుర్రంపోడ్ లోని గౌతమీ పాఠశాల తీరు పై విద్యార్థి సంఘాల అసహనం 
  • థియేటర్ లో బడి కధనంతో చలనం లేని నల్గొండ విద్యా శాఖ 
  • జిల్లా విద్యా శాఖ అధికారి తీరుతో విద్యార్థుల కు ప్రమాదం పొంచి ఉందా..! 
  • సరైన బిల్డింగ్ నిర్మాణాలు లేని పాఠశాలలకు అనుమతులు 
  • కాసుల కక్కుర్తి లో విద్యా యంత్రాంగం..! 
  • తనిఖీలు చేయకుండానే అన్ని సంతకాలు టేబుల్స్ మీదే 
  • బాధ్యత తో ఉండాల్సిన అధికారులు చేతులు తడిపితే ఏదైనా చేస్తారా..!
  • విద్యార్థి సంఘాలు నిరసనలు చేపట్టిన  అధికారులకు పట్టింపు లేదు 

గుర్రంపోడు , విశ్వంభర : జులై 09:-పాడు"బడి"న థియేటర్ లో పాఠశాల విద్యా వ్యవస్థను నడిపిస్తున్న తీరు నల్గొండ జిల్లా , గుర్రంపోడ్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.విద్యా శాఖ అధికారులు నిబందనలకు నీళ్లు వదులుతూ పుట్ట గొడుగుల్లా వెలిసిన ప్రవేట్ పాఠశాలలకు తనిఖీలు చేయకుండానే అనుమతులు ఇచ్చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి .బలమైన పునాదుల మీద దేశ భవిశ్యత్తు నేటి విద్యార్థుల చేతుల్లోనే ఉంది. అలాంటి విద్య వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా కేవలం అడ్మిషన్ లు  , అధిక ఫీజుల వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ మంచి బిల్డింగ్ నిర్మాణాల పై  లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . పాడుబడ్డ థియేటర్ నీ బడి గా మార్చి స్కూల్ లను నడిపిస్తున్నారు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు . రానున్న వర్షాకాలం నేపథ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా అలాంటి థియేటర్ లో  పాత గోడల మధ్య విద్యార్థులకు భరోసా ఎవరు..  విద్య శాఖ లో చలనం లేకపోవడం దారుణమైన పరిస్థితులకు దారి తీస్తున్నట్టే అనుకోవచ్చు. సరైన బిల్డింగ్ నిర్మాణం , గదుల ఏర్పాటు ,ఒక పాఠశాల నడిపించాలంటే విద్యా శాఖ నిబంధనలు , అనుమతులు పరిగణనలోకి తీసుకోకుండా , డబ్బులతో ఏదైనా చేయగలం అనుకునే యాజమాన్యాలకు విద్యా శాఖ యంత్రాంగం అండ దండలు ఉన్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి అని పలు సంఘాలు ఆరోపించాయి .జి ఓ నెంబర్ వన్ ని తుంగ లో తొక్కి నిబంధనలు లేకుండానే చేసి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్న తీరు..అధికారులు , యాజమాన్యాలు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడ్డారని పిల్లల తల్లితండ్రులు భావిస్తున్నారు.పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టినప్పటికీ పట్టించుకోని వ్యవస్థలో విద్యా శాఖ తీరు కనిపిస్తుంది అంటూ మండి పడ్డారు  . జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ప్రవేట్ పాఠశాలల నిర్లక్ష్య తీరు పై చర్యలు తీసుకోకపోవడం సర్వత్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. మరి ఇప్పుడైనా చర్యలు తీసుకుంటారా..!

Tags: