ఆకట్టుకున్న శ్రీరాధాకృష్ణుల వేషధారణ.- కుమారి కనిష్క, ఆధ్య లకు ప్రశంస పత్రం అందజేత.
ఘనంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణా జన్మాష్టమి వేడుకలు.
On
విశ్వంభర, నిజామాబాదు :- ఇందూరు ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణా జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా కుమారి కనిష్క, కుమారి ఆధ్య శ్రీరాధాకృష్ణుల వేషధారణలతో నృత్యం చేయడం పలువురు భక్తులను ఆధ్యంతం ఎంతోగానో ఆకట్టుకుంది. రాధాకృష్ణుల వేషధారణతో ఆకట్టుకున్న వీరిని భక్తులు , స్థానిక ప్రజాప్రతినిధులు వీరివురికి అభినందనలు తెలిపారు. అలాగే ఇస్కాన్ టెంపుల్ వారు వారికి ప్రశంస పత్రం అందజేసి శాలువాతో సత్కరించారు.



