ఘనంగా ఐఎంఈసిఈ 2025 అవార్డ్స్ . - ముఖ్య అతిధిగా ఏపీ ఎంఎస్ఎమ్ఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ 

ఘనంగా ఐఎంఈసిఈ 2025 అవార్డ్స్ . -  ముఖ్య అతిధిగా ఏపీ ఎంఎస్ఎమ్ఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ 

విశ్వంభర, హైదరాబాద్ :- అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ తన ప్రఖ్యాత అంతర్జాతీయ మెకానికల్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ , ఎక్స్‌పోసిషన్ ను మొదటిసారిగా భారతదేశానికి తీసుకువచ్చింది. ఏఎస్ఎంఈ తన ఫ్లాగ్‌షిప్ కాంగ్రెస్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చి, రికార్డు స్థాయి విద్యార్థుల పాల్గొనుట, హ్యాకథాన్‌లు, అంతర్జాతీయ పరిశోధన సహకారాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏపీ ఎంఎస్ఎమ్ఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పాల్గొని వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమంలో బెస్ట్ ఎంట్రప్రెన్యూర్ అవార్డ్స్ అందజేశారు. ఐఎంఈసిఈ ఇండియా 2025 – భారతదేశం యొక్క ఆవిష్కరణల  ఆధారిత భవిష్యత్తుకు గ్లోబల్ అవకాశాలను విస్తరించనుంది. అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ (ఏఎస్ఎంఈ) తన ప్రఖ్యాత అంతర్జాతీయ మెకానికల్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ ,  ఎక్స్‌పోసిషన్ (ఐఎంఈసిఈ)ను మొదటిసారిగా భారతదేశానికి తీసుకువచ్చింది. చైర్మన్  తమ్మిరెడ్డి శివశంకర్ మాట్లాడుతూ  ఐఎంఈసిఈ ఇండియా 2025లో 11 టెక్నికల్ ట్రాక్‌లు, ఐదు ముఖ్య ఫోకస్ ఏరియాలు ఎంఎస్ఎంఈ కాన్‌క్లేవ్, హార్డ్‌వేర్ స్టార్ట్‌అప్‌ల కోసం ఇన్నోవేషన్ స్క్వేర్, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సింపోజియం, ఉమెన్ ఇన్ ఇంజనీరింగ్ ప్యానెల్, అలాగే ఆరు గంటల డిజైన్ స్ప్రింట్‌తో విద్యార్థుల ప్రత్యేక కార్యక్రమాలు ప్రధానంగా నిర్వహించారు. ఆవిష్కరణ, సస్టైనబిలిటీ, ఇన్‌క్లూజన్ అనే థీమ్‌తో ఈ ఈవెంట్ అకాడెమియా, పరిశ్రమ, ప్రభుత్వం కలిసి భవిష్యత్‌కు సిద్ధమైన అవకాశాలను సృష్టించేందుకు ప్రత్యేక వేదికను అందించిందని అన్నారు.

Tags: