తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేటీఆర్, హరీశ్‌రావు.. గాయాలను పరిశీలించిన హరీశ్‌రావు
- ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రాకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోంది: బీఆర్‌ఎస్
KTR, Harish Rao Arrest,: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. నల్ల దుస్తులు ధరించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీలోకి అనుమతించకుండా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు తెలంగాణ భవన్‌కు తరలించారు. అనంతరం కేటీఆర్, హరీశ్‌రావును కూడా అదుపులోకి తీసుకుని తెలంగాణ భవన్‌కు తీసుకెళ్లారు.
ఈ క్రమంలో పోలీసుల దురుసు ప్రవర్తన కారణంగా కేటీఆర్‌కు గాయాలయ్యాయని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. తెలంగాణ భవన్‌కు చేరుకున్న హరీశ్‌రావు.. కేటీఆర్ గాయాలను పరిశీలించారు.బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపేందుకు వచ్చిన తమ ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన ప్రజాప్రతినిధులను ఇలా అడ్డుకోవడం సరికాదని బీఆర్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీసుల చర్యలు, కేటీఆర్‌కు గాయాలైన ఘటనపై పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.



