నేడు డీఎస్సీ  హాల్ టికెట్లు విడుదల

నేడు డీఎస్సీ  హాల్ టికెట్లు విడుదల

హైదరాబాద్ :జులై 11 తెలంగాణ రాష్ట్రంలో డిఎస్‌సి పరీక్షలు యథా తథంగా షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది.ఈ మేరకు ఈరోజు సాయంత్రం డిఎస్‌సి హాల్ టికెట్లు వెబ్‌ సైట్‌లో అందుబాటులో ఉంచనున్నది. 

అభ్యర్థులు వెబ్‌సైట్ ( https://tsdsc.aptonline.in/tsdsc/ )నుంచి తమ హాల్ టికెట్లను డౌన్‌ లోడ్ చేసుకోవాలి. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లో డిఎస్‌సి పరీక్షలు జరుగనున్నాయి. 

Read More డా. కోడి శ్రీనివాసులుకు అభినందనలు - MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డిఎస్‌సి -2024 పరీక్షలు ఈనెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించను న్నారు. తొలిసారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సిబిటి) విధానంలో డిఎస్‌సి పరీక్ష జరగనున్నది. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించను న్నట్లు డిఎస్‌సి పరీక్ష నిర్వహించనున్నారు.  ఈ మేరకు ఇటీవల సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలను ప్రకటించారు. డిఎస్‌సి 2024 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4న ప్రారం భంకాగా…గత నెల 20వ తేదీతో గడువు ముగిసింది.  ఈ ఉద్యోగాలకు మొత్తం 2,79,966 మంది అభ్య ర్థులు దరఖాస్తు చేసుకు న్నారు.