పవిత్ర కోసం నా జీవితం మొత్తం నాశనం చేశాడు...చెప్పవే పాప అంటూ నా ముందే వీడియో కాల్ మాట్లాడేవాడు... చందు భార్య శిల్ప ఎమోషనల్ కామెంట్స్
విశ్వంభర, వెబ్ డెస్క్ : ఇటీవల రోడ్ యాక్సిడెంట్ లో త్రినయని సీరియల్ ఆర్టిస్ట్ పవిత్ర జయరాం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆమె మరణ వార్తను జీర్ణించుకోలేక అదే సీరియల్ కు చెందిన మరో నటుడు చందు శుక్రవారం హైదరాబాద్, మణికొండలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తెలుగు బుల్లితెర ఇండ్రస్ట్రీలో మరోసారి తీవ్ర విషాదం నెలకొంది.
ప్రస్తుతం చందు రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం వంటి సీరియల్స్ లో నటిస్తున్నారు. కాగా 2015లో శిల్ప అనే ఆమెను చందు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇది పక్కన పెడితే… తాజాగా చందు భార్య శిల్ప చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే... చంద్రకాంత్ భార్య మాట్లాడుతూ..." మేం ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. పెళ్లైన కొత్తలో చందు నన్ను బాగా చూసుకునేవాడు. ఆ సమయంలోనే తనకు త్రినయని సీరియల్ లో అవకాశం వచ్చింది.
అప్పటి నుంచి పవిత్ర జయరాం తో సంబంధం ఏర్పడింది. అప్పటి నుంచి నన్ను కొట్టడం, తిట్టడం, చిత్రహింసలకు గురి చేయడం, సోషల్ మీడియాలో నన్ను బ్లాక్ చేయడం చేశాడు. ఇక పవిత్ర జయరాం నాకు ఫోన్ చేసి చందు నా భర్త ఇక నువ్వు మరిచిపో అని బెదిరిచింది. దీంతో ఒకసారి నేను పవిత్ర కొడుకును కలిసి విషయం చెప్పగా వాళ్ల లైఫ్ వాళ్ల ఇష్టం మాకు తనతో సంబంధం లేదని చెప్పాడు. ఇంట్లో ఉంటే ఎప్పుడూ ఆమెతో ఫోన్ లో వీడియో కాల్ మాట్లాడుతూ... చెప్పవే పాపం... ఏం చేస్తున్నావ్...నన్ను మిస్ అవుతున్నావా అంటూ మాట్లాడేవాడు.
నా గురించి అందరికీ బ్యాడ్ గా చెబుతూ నన్ను బ్లేమ్ చేశాడు. పవిత్రకు రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత బెడ్ పై పడుకొని ట్రీట్మెంట్ తీసుకుంటూ మా ముందే పవిత్ర గురించి ఏడ్చుకుంటూ ఆమెను తల్చుకున్నాడు. ఇన్నాళ్లు తాను అర్థం చేసుకుంటాడన్న నమ్మకంతో బతికాను..తీరా ఇప్పుడు ఆ నమ్మకం కూడా లేకుండా చేశాడు. పవిత్ర కోసం నా జీవితాన్ని నాశనం చేశాడు" అంటూ శిల్ప ఎమోషనల్ అయ్యింది.