గ్రామీణ యువతకు చిందం అంజన్ కుమార్ ఆదర్శం: కొంగర విష్ణువర్ధన్ రెడ్డి

విశ్వంభర, ఇబ్రహీంపట్నం: ఒకేసారి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన చిందం అంజన్ కుమార్ గ్రామీణ యువతకు ఆదర్శమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం అంజన్ కుమార్‌ను ఘనంగా సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేద కుటుంబంలో జన్మించి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న అంజన్ కుమార్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు క్లర్క్, హైకోర్టు ఫీల్డ్ అసిస్టెంట్, రెండు రైల్వే ఎన్‌టీపీసీ ఉద్యోగాలు, టీజీఎస్‌ఆర్‌టీసీ సూపరింటెండెంట్ పోస్టులతో కలిపి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి స్పష్టమైన లక్ష్యంతో కృషి చేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, అంజన్ కుమార్ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుడిమల్ల చంద్రయ్య, మార సురేష్, వస్పరి కుమార్, ఎండి అశ్రఫ్, కోరె పాండు తదితరులు పాల్గొన్నారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/anjan-kumar-is-a-role-model-for-the-rural-youth/article-20060

Tags: