మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో  అవగాహన సదస్సు

మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో  అవగాహన సదస్సు

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం న్యాయ సేవ అధికార సంస్థ సంచార వాహనం సహకారంతో రామన్నపేట మండల పరిధిలోని పల్లివాడ, దుబ్బాక గ్రామాలలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్యానల్ అడ్వకేట్ కునూరు శ్రీనివాస్, మండల లీగల్ సెల్ సభ్యులు కానుగంటి శ్రీశైలం, కురిమేటి యాదయ్యలు హాజరయ్యారు. పల్లివాడ గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ కుంభంపాటి శ్రీనివాస్, దుబ్బాక గ్రామ సర్పంచ్ గట్టు నరసింహ ల అధ్యక్షతన అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథి కే.శ్రీనివాస్ మాట్లాడుతూ, వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం 2007, బాల్య వివాహ నిర్మూలన చట్టం 2006, ఫోక్సో చట్టం 2012, బాల కార్మికుల నిర్మూలన చట్టం 1986, నిర్బంధ ప్రాథమిక విద్య హక్కు చట్టం 2009, మొదలగు చట్టాలపై వివరించడం జరిగింది. గంజాయి, గుట్కా, డ్రగ్స్, బారిన పడకుండా విద్యార్ధులు ముఖ్యంగా అన్ని రంగాలలో ముందు ఉండాలాంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ఉన్నత విద్య అభ్యసించటం వల్లనే ప్రపంచాన్ని మార్చే అవకాశం ఉంటుందనీ, ఎలాంటి సమస్యలు వచ్చిన వెంటనే పరిష్కారం దిశగా అడుగులు వేయాలని సూచించారు. అందరికీ పలు రకాల చట్టాలపై అవగాహన పొందాలని, విద్యా హక్కు చట్టం, బాలకార్మిక నిరోధక చట్టం, బాల్యవివాహాలు, ఫోక్సో చట్టం, లేబర్ చట్టాలు, మాదక ద్రవ్యాలు, అన్ని రకాలుగా ఎలాంటి సమస్య వచ్చిన చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు ఏ సమస్య ఎదురైన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లలో గానీ, మండల స్థాయిలో ఉన్న న్యాయ సేవ అధికార సంస్థ దృష్టికి గాని తీసుకు రావాలని, ఎవరు కూడా అధైర్య పడవద్దని సూచించారు. గ్రామ ప్రజలు, యువత చెడు దారి పట్టకుండా మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండాలని, అందుకు సంబంధిత చట్టాలపై పట్టు కలిగి ఉండాలని  అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్కడ హాజరైన ప్రజల  తమ సమస్యల పట్ల కొన్ని సమస్యలు వాటికి సంబంధించిన కొన్ని రకాల సెక్షన్ల గురించి ఫ్యానల్ అడ్వకేట్ ను అడిగి తెలుసుకున్నారు. పల్లివాడ   ఉప-సర్పంచ్ మధు, దుబ్బాక ఉప-సర్పంచ్ గుండాల రమేష్, పల్లివాడ గ్రామ కార్యదర్శి వెంకటేష్, దుబ్బాక గ్రామ కార్యదర్శి కె.కవిత, ఇరు గ్రామాల వార్డు మెంబర్లు, మల్టీపర్పస్ వర్కర్లు, ప్రజలు, కోర్టు సిబ్బంది, తదితరులు హాజరయ్యారు

Tags: