మజ్లిస్ ను రాష్ట్రం నుంచి తరిమికొట్టే ఏకైక పార్టీ బీజేపీ.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
విశ్వంభర, వికారాబాద్ : సర్జికల్ స్ట్రైక్స్ చేసే ధైర్యం కాంగ్రెస్ కు లేదని, బీజేపీ ఉన్నంతవరకు పీవోకే పాక్ వశం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ఉగ్రవాదులను అణిచి వేసినట్లు తెలిపారు. వికారాబాద్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి హస్తం పార్టీ ఏనాడూ పాటుపడలేదు. ఆ పార్టీతో పాటు మజ్లిస్ ను రాష్ట్రం నుంచి తరిమికొట్టే శక్తి కేవలం బీజేపీ కే ఉంది అని అమిత్ షా తెలిపారు. కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని అన్నారు. ఉగ్రవాదులను కాంగ్రెస్ పార్టీ కాపాడుతూ వచ్చిందని ఆరోపించారు. దేశంలో ఉగ్రవాదాన్ని పారద్రోలడానికి మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. అయోధ్యలో రామ మందిర అంశాన్ని కాంగ్రెస్ 70 ఏళ్లుగా సాగదీస్తూ వచ్చిందని, ఆలయ ప్రాణ ప్రతిష్ఠకు సైతం కాంగ్రెస్ నేతలు పాల్గొన లేదని వివరించారు.