రైతులకు అలెర్ట్.. వీరికి పీఎం కిసాన్ డబ్బులు రావు..!
On
కేంద్రంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఆయన ప్రధాని అయిన తర్వాత మొదటి సంతకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బుల విడుదలపై చేశారు. దాంతో 17వ విడతగా రూ.20 వేల కోట్లు విడుదలయ్యాయి.
అయితే ఈ సారి కొందరు రైతులకు ఈ డబ్బులు అందవని కేంద్రం స్పష్టం చేసింది. ఈ కేవైసీ చేయించుకోని రైతులకు డబ్బులు వేయబోమని తెలిపింది. దాంతో పాటు బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకుంటే వాయిదా ఆగిపోతుంది. ఈ కేవైసీ చేయించుకోవాలని ఇప్పటికే కేంద్రం చాలా సార్లు స్పష్టం చేసింది.
వీరికి ఇచ్చే డబ్బులను ఆపేస్తున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. కాబట్టి ఈ విడత డబ్బులు రావాలంటే మాత్రం కచ్చితంగా రైతులు ఈ కేవైసీ చేయించుకోవాలని కేంద్రం తెలుపుతోంది.



