13వ డివిజన్ డబల్ బెడ్ రూమ్ ల వరకు బస్సులను పొడిగించాలి

-డిపో మేనేజర్ కు వినతి పత్రం
 
-రవాణా సౌకర్యం లేక సతమతమవుతున్న డివిజన్ ప్రజలు
 
-సానుకూలంగా స్పందించిన డిపో మేనేజర్

 

WhatsApp Image 2024-07-23 at 17.34.24_a11cf285విశ్వంభర  జూలై 23 : - మేడ్చల్ జిల్లా/మేడిపల్లి: విశ్వంభర: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ కార్పొరేటర్ దాన గళ్ళ అనిత యాదగిరి ఆధ్వర్యంలో ఉప్పల్ డిపో మేనేజర్ శ్రీనివాస్కు వినతి పత్రo అందచేశారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు గోపు రాములు మాట్లాడుతూ 13వ డివిజన్లో కాలనీలు విస్తృతంగా పెరిగిపోయాయనీ, పలు కాలనీలలో జనావాసాలు అధికమయ్యారని, ప్రజల యొక్క క్షేమాలను దృష్టిలో ఉంచుకొని వారికి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, బస్సులు అందుబాటులో ఉండే విధంగా కార్పొరేటర్ దానగళ్ళ అనిత యాదగిరినీ  డిపో మేనేజర్ నీ కలిసి డివిజన్ ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారనీ తెలిపారు. డివిజన్ ప్రజలకు, విద్యార్థులకు, వికలాంగులకు బస్సులు అందుబాటులో లేవని, దేవేందర్ నగర్ కాలనీ,రాజీవ్ నగర్ కాలనీ లోని డబుల్ బెడ్ రూమ్ ల వరకు 18 బి,113 మరియు 115 నెంబర్ గల బస్సులన పొడిగించలాని మేనేజర్ కు విన్నపించుకొని వెలితి పత్రం అందజేశారు. దానికి సానుకూలంగా స్పందించిన డిపో మేనేజర్ తొందర్లోనే బస్సు రూట్ ను పరిశీలించి బస్ సర్వీసులను పొడిగిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. దేవేందర్ కాలనీ అధ్యక్షులు నల్ల నరసింహ, కొండ శ్రీనివాస్, మల్లెపాక శంకర్, మంచినీళ్ళ శ్రీనివాస్, మల్లెపాక శేఖర్, డివిజన్ ముఖ్యులు డిపో మేనేజర్ నీ కలిసి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని విన్నపించారు