ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ఘన సన్మానం
విశ్వంభర, ఆత్మకూరు(ఎం) : తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ కి 50 కోట్లు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తు, ఇవే కాకుండా వంద కోట్ల రూపాయలను పరిషత్ కి కేటాయించాలంటూ, ఉమ్మడి తెలంగాణ జిల్లాలలో ప్రతి జిల్లాలలో బ్రాహ్మణ భవనం నిర్మించాలని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సభ్యులు ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్యని కోరారు. ఈ సందర్బంగా దేవాలయాలను అభివృద్ధి చేస్తు అర్చకులకు సకాలంలో జీతభత్యాలు ఇస్తు వారికి కూడా ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉండాలంటు పేర్కొన్నారు. ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ను బ్రాహ్మణ సేవా సంఘం ఘనంగా సత్కరించారు . రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మోత్కూరి రాము మాట్లాడుతూ మునుముందు బ్రాహ్మణ శ్రేయస్సు కోసం మీరు ముందుండాలని శాసన సభ్యుడిని కొనియాదారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మోత్కూరి రాము, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నమిలికొండ కిరణ్, ఆలేరు మాజీ సర్పంచ్ మోహన్ రావు , విష్ణుదాసు, వంశీధర్ రావు, శేషగిరి రావు తదితరులు పాల్గొన్నారు.