ప్రభుత్వం పాఠశాలల నిర్వహణ బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించడం హర్షణీయం ; కోలన్ నీలా గోపాల్ రెడ్డి
రాజీవ్ గాంధీ నగర్ ,హైద్రాబాద్-విశ్వంభర :- కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ తో కలిసి 16వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ నల్ల పోచమ్మ ఆలయం వద్ద వెన్నెల పొదుపు సంఘం, మహిళా శక్తి అమ్మ ఆదర్శ ప్రభుత్వ పాఠశాల యూనిఫామ్స్ స్టిచింగ్ కేంద్రాన్ని మేయర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.ఈl సందర్భంగా నిర్వాహకురాలు 16వ డివిజన్ మహిళా నాయకురాలు రజిత రెడ్డికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల నిర్వహణ బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించిందని,మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషం, అభినందనీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ మహిళా నాయకురాలు సబిత జలంధర్ రెడ్డి,125వ డివిజన్ మహిళా అధ్యక్షురాలు,ప్రధాన కార్యదర్శి, స్థానిక డివిజన్ మహిళలు ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.