విద్యాశాఖ అధికారి వాసంతి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమావేశం.

విద్యార్థుల సంఖ్య ను పెంచుకోవాలి

విద్యాశాఖ అధికారి వాసంతి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమావేశం.

విశ్వంభర హనుమకొండ జిల్లా :-  జిల్లాలోని అన్ని ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశం తాళ్ల పద్మావతి ఒలంపియాడ్, సోమిడి, ఖాజీపేట పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి డి. వాసంతి  అధ్యక్షతన జరిగింది. ఉదయం ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు  మధ్యాహ్నం ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమావేశం నిర్వహించడం జరిగింది. 

ఇందులో ముఖ్యంగా విద్యార్థులు  ఉపాధ్యాయులు తప్పనిసరిగా FRS హాజరు నమోదు చేయాలని అందులో ఏవైనా సమస్యలు ఉంటే మండల కేంద్రంలో గాని లేదా జిల్లా కేంద్రంలోని సంప్రదించి ఆ సమస్యలను నివృత్తి చేసుకోవాలని కానీ ముఖచిత్ర హాజరు తప్పకుండా నమోదు చేయాలని లేదంటే గైర్హాజరుగా పరిగణించబడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశించారు. 
UDISE కార్యక్రమాలు పూర్తి చేయుట 
పాఠశాల విద్యాశాఖకు UDISE అనేది ప్రామాణికంగా మారింది పాఠశాల విద్యకు సంబంధించి ప్రతి విషయానికి సంబంధించిన సమాచారము UDISE portal నుండి తీసుకోవడం జరుగుతుంది కావున అందులో ప్రతి పాఠశాలలో భౌతికంగా నమోదైన విద్యార్థుల వివరాలను పాఠశాల లాగిన్ లో నమోదు చేయవలసిన అవసరము ఉన్నది. అంతేకాకుండా ఆ పాఠశాల నుండి వెళ్లిపోయిన విద్యార్థి ఏ పాఠశాలలో చేరాడో తెలుసుకొని వారి ద్వారా ఆ విద్యార్థిని ఆ పాఠశాలలోకి చేర్చుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.  
అదేవిధంగా ప్రతి పాఠశాలలో యుడైస్ లో నమోదైన విద్యార్థి యొక్క వివరాలన్నీ profiles (GP,EP,FP) కూడా నమోదు చేసి ఆధార్ నెంబర్తో అనుసంధానము చేయవలసి ఉన్నది. ఆధార్ నెంబర్తో అనుసంధానమైన ప్రతి విద్యార్థికి APAAR id నీ కూడా పొందుపరచాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. 
విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరీక్షించుటకు బేస్ లైన్ టెస్ట్ జూన్ మాసంలో నిర్వహించుకోవడం జరిగింది. ఆ తర్వాత గత రెండు నెలలుగా పాఠశాల నిర్వహణలో విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు ఏ మేరకు వృద్ధి చెందాయో తెలుసుకోవడానికి సెప్టెంబర్ 10వ తేదీన  సామర్థ్యాల పరీక్ష నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినందున ఆ పరీక్షకు విద్యార్థులను సంసిద్ధులను చేయవలసిందిగా ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. 
ఏక్ పేడ్ మా కే నామ్ లో భాగంగా ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్థితోని పాఠశాలలో ఆవరణలో కానీ లేదా ఇంటి వద్ద కానీ వారి అమ్మ పేరు మీద ఒక మొక్క నాటి దానిని పెంచుటకు తగిన ప్రోత్సాహం చేయాలని ప్రధానోపాధ్యాయులను కోరారు.
     మధ్యాహ్న భోజన పథకం అమలులో తగిన మెనూ పాటించి విద్యార్థులకు పోషకాహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని అందులో ఏమినహాయింపు ఉండకూడదని ప్రధానోపాధ్యాయులను కోరారు. 
అదేవిధంగా పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు మరియు ఏకరూప దుస్తులు పాఠశాలలో ప్రారంభమైన సమయంలో విద్యార్థులందరికీ పంపిణీ చేసినప్పటికీ ఇప్పటివరకు దానికి సంబంధించిన సమాచారము ఆన్లైన్ లో నమోదు చేయుట పూర్తి అయినప్పటికీ ఇంకా అక్కడక్కడ కొంత gap ఉన్నది. కాబట్టి మొత్తం కూడా పూర్తి అయ్యే విధంగా ప్రధానోపాధ్యాయులు సంబంధిత మండల సమాచార కేంద్రం వారికి సహకరించాలని కోరడం జరిగింది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Read More వర్షాలు సమృద్ధిగా కురవాలి. -కొమురవెల్లి మల్లన్న స్వామి సన్నిధిలో దామర్లపల్లి మాజీ సర్పంచ్ బోకుల లింగం ప్రత్యేక పూజలు*

Tags:  

Advertisement

LatestNews

శ్రీ లక్ష్మనేశ్వర  స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం 
ఒకరికి ఒకే ఓటు.. అనర్హుల పేర్లకు చోటు లేదు!,-డా. వైభవ్ రెడ్డి
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) చేవెళ్ల ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా పడమటి నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, గుత్తి రాఘవేందర్
సన్ షైన్ పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలు
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా.. షాబాద్‌లో సేవా సంకల్ప్ అభియాన్
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దు. - కోడి శ్రీనివాసులు , మున్సిపల్ చైర్మన్ 
ఘనంగా ముగిసిన తెలంగాణ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజిస్ట్స్ కాన్ఫరెన్స్ 2026