ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ పై చీటింగ్ కేసు
On
విశ్వంభర, వెబ్ డెస్క్ : ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ పై తెలంగాణలో చీటింగ్ కేసు నమోదు అయింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేసేందుకు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని, రూ. 50 లక్షలు తీసుకుని టికెట్ ఇవ్వకుండా మోసం చేశాడని, జిల్లెలగూడ కు చెందిన కిరణ్ కుమార్ కేఏ పాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇందులో రూ. 30 లక్షలు ఆన్ లైన్ లో కేఏ పాల్ కు చెల్లించానని, మిగిలిన రూ. 20 లక్షలు పలు దఫాల్లో ఇచ్చానని పేర్కొన్నాడు. కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేఏ పాల్ పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags: KA Paul cheating case