అట్టుడికిపోతున్న పాట్నా... కారణం ఇదే..!

అట్టుడికిపోతున్న పాట్నా... కారణం ఇదే..!

విశ్వంభర, వెబ్ డెస్క్ : బీహార్ రాజధాని పాట్నాలో నిరసనలతో అట్టుడికిపోతోంది. పాఠశాలకు వెళ్లిన విద్యార్థి తిరిగి ఇంటికిరాక పోగా...అనుమానాస్సదరీతిలో చనిపోయింది. అయితే చనిపోయిన విషయాన్ని స్కూల్ సిబ్బంది దాచేందుకు ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. బాధిత కుటుంబానికి అండగా ఓ కులం తోడై పాట్నాలో నిరసనలకు దిగింది. రోడ్లపై మంటలు పెట్టి...సత్వర న్యాయం కోసం డిమాండ్ చేస్తోంది. 

టినీ టాట్ అకాడమీ స్కూల్ లో చదివే చిన్నారి...గురువారం స్కూల్ ట్యూషన్ అయ్యాక కూడా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో స్కూల్ కు వెళ్లి అడగగా...స్కూల్ సిబ్బంది పొంతనలేని సమాధానం ఇవ్వడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది అర్ధరాత్రి వరకు స్కూల్ పరిసరాలను వెతికారు. 

Read More తిరిగి మన మూలాల్లోకి వెళ్దాం:వెంకయ్య నాయుడు

చివరకు ఉదయం 3 గంటల ప్రాంతంలో స్కూల్ ఆవరణలోనా డైనేజీలో చిన్నారి మృతదేహం కనిపించింది. దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు స్కూల్ కు నిప్పంటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్కూల్ కు చేరుకున్న ఉద్రిక్తతలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎస్పీ చంద్రప్రకాష్ స్వయంగా ఈ కేసు దర్యాప్తు చేపట్టారు.

ఎస్పీ వివరిస్తూ....స్కూల్ లోకి వెళ్లిన చిన్నారి ....తిరిగి బయటకు వెళ్లిన సీసీటీవీ ఫుటేజీల్లో నమోదు అయ్యింది. దీంతో ఈ ఆవరణలోనే చిన్నారి మృతి చెందినట్లు నిర్థారించుకున్నాం.ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, సిబ్బంది మృతి దేహాన్ని దాచే ప్రయత్నం ఎందుకు చేసిందో తేలాల్సి ఉందన్నారు. మరోవైపు ఉద్రిక్తతలు విస్తరించకుండా పోలీస్ బలగాలను మోహరించినట్లు తెలిపారు.

Related Posts