పిచ్చి పీక్స్ కి వెళితే ఇలానే ఉంటది.. గన్ తో హైవే పై రీల్ చివరికి…
విశ్వంభర, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు చాలా మంది. కొంత మంది ప్రమాదకర స్టంట్స్ చేస్తూ,మరికొంత మంది తమ చుట్టు పక్కన ఎవరు ఉన్నారు ఏం అనుకుంటారు అనే ఆలోచలే లేకుండా తమకు నచ్చిన విధంగా రకరకాల వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ప్రమాదకర ప్రయత్నాలు చేస్తూ చావు నోట్లో తల పెట్టిన వారు లేకపోలేదు. అయిన కూడా అవేమి పట్టవన్నట్లు తమ పని తాము చేసుకుందాం అనుకుంటున్నారు. తాజాగా లఖ్ లవూకు చెందిన ఓ యూట్యూబర్ రద్దీగా ఉన్న రోడ్డు మధ్యలో గన్ తో చేసిన రీల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ యూట్యూబర్ గా సామాజిక మాధ్యమంలో పేరొందిన సిమ్రాన్ యాదవ్ అనే యువతి గన్ చేతిలో పట్టుకుని చేసిన రీల్ ను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో గన్ చేతిలో పట్టుకుని ఓ పాటకు డాన్స్ చేస్తూ కనిపించింది. రద్దీగా ఉన్న ప్రాంతంలో గన్ పట్టుకొని వీడియో తీయడం పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ లఖ్ నవూ ఇన్ స్టాగ్రామ్ స్టార్ సిమ్రాన్ ప్రమాదకరంగా తుపాకితో రీల్ చేస్తూ బహిరంగంగా చట్టాలను అతిక్రమిస్తేంటే అధికారులు మౌనంగా ఉన్నారు అంటూ పోలీసులకు టాగ్ చేశారు. స్పందించిన పోలీసులు యువతిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.