ఆస్పత్రిలో చేరిన బీహార్ సీఎం నితీశ్ కుమార్
- చేతినొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిక
- ఆర్థో విభాగంలో చికిత్స అందిస్తున్న వైద్యులు
- నిలకడగా నితీశ్ కుమార్ ఆరోగ్యం
బీహార్ సీఎం నితీష్ కుమార్ శనివారం ఉదయం ఆకస్మాత్తుగా పాట్నాలోని అతిపెద్ద ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఉదయం నిద్ర లేవగానే ఆయనకు చేతినొప్పి రావడంతో ఆయన సన్నిహితులు వెంటనే వైద్యులను సంప్రదించారు. వారి సూచన మేరకు ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం నితీశ్‌కుమార్ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.
ఆయనకు ఆర్థో విభాగంలో చికిత్స పొందిస్తున్నట్లు వెల్లడించారు. నితీశ్ కుమార్ శుక్రవారం ఉప కేబినెట్ సమావేశానికి పిలిచారు. ఈ సమావేశంలో బీహార్ ప్రభుత్వంలోని అన్ని శాఖల మంత్రులు పాల్గొని 25 అజెండాలను కూడా ఆమోదించారు. ఇదివరకూ నితీశ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురయ్యారు. చికిత్స అనంతరం ఎన్నికల ప్రచారంలో చురుకుగా కనిపించారు.
ఫలితాలు వచ్చాక బీహార్‌లో నితీశ్ ప్రభుత్వం ఏర్పాటైంది. సీఎం హోదాలో ఢిల్లీ వెళ్లి తమ పార్టీలోని నేతలకు కేంద్ర మంత్రి పదవులను తీసుకున్నారు. ఇదిలా ఉండగా, బీహార్‌లో మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జూన్ 29న జాతీయ కార్యవర్గ సమావేశాన్ని జేడీయూ ప్రకటించింది. ఈ సమావేశానికి ముందు నితీశ్ కుమార్ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.