‘ఇరుముడి’ హవా కొనసాగుతోంది.. గ్రామాల నుంచి ట్రాక్టర్లలో థియేటర్లకు ప్రేక్షకులు

‘ఇరుముడి’ హవా కొనసాగుతోంది.. గ్రామాల నుంచి ట్రాక్టర్లలో థియేటర్లకు ప్రేక్షకులు

  • మూడో వారంలోనూ అదే సందడి.. ‘ఇరుముడి’కి ప్రేక్షకుల నీరాజనం

Irumudi Movie: టాలీవుడ్‌లో ‘ఇరుముడి’ సినిమా తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. విడుదలై మూడో వారంలోకి అడుగుపెట్టినా సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రేక్షకులు ట్రాక్టర్లలో థియేటర్లకు తరలివస్తుండటంతో పలు చోట్ల పండుగ వాతావరణం కనిపిస్తోంది. థియేటర్ల వద్ద అభిమానులు, ప్రేక్షకుల సందడి సినిమాకు ఉన్న క్రేజ్‌ను చూపిస్తోంది.

సినిమా విడుదలైన తర్వాత వరుసగా మంచి స్పందనను అందుకుంటూ భారీ కలెక్షన్లు సాధిస్తోందని చిత్ర బృందం చెబుతోంది. మూడో వారంలోనూ థియేటర్ల వద్ద ప్రేక్షకుల సందడి కొనసాగుతుండటంతో ‘ఇరుముడి’ టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు సినిమా చూసేందుకు వస్తుండటం మూవీకి లభిస్తున్న ఆదరణకు నిదర్శనంగా మారింది.

Read More ఇలాంటి పోజులు అవసరమా?.. జ్యోతిక ఫోటోషూట్‌పై సోషల్ మీడియాలో ట్రోల్‌

ఈ ఏడాది పండుగల సమయంలో ‘ఇరుముడి’ ప్రేక్షకుల ముందుకు రాకపోయినా.. భారీ వసూళ్లతో ఇండస్ట్రీకి మరో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిందని అభిమానులు, సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. మూడో వారంలోనూ అదే జోష్‌తో సినిమా ప్రదర్శనలు కొనసాగుతుండటంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ప్రేక్షకుల ఆదరణతో టాలీవుడ్‌లో గతంలో కనిపించిన బ్లాక్‌బస్టర్ సినిమాల రోజులను ‘ఇరుముడి’ మరోసారి గుర్తు చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

 

 

 

 

 

Related Posts