బిగ్‌ స్టార్స్‌ అందరూ పాన్‌ ఇండియా సినిమాల వెంటే: సందీప్‌ రెడ్డి వంగా

బిగ్‌ స్టార్స్‌ అందరూ పాన్‌ ఇండియా సినిమాల వెంటే: సందీప్‌ రెడ్డి వంగా

  • దర్శకుడిగా మారాక థియేటర్‌లో సినిమాలు చూడటం తగ్గించాను: సందీప్‌ రెడ్డి

Sandeep Reddy Vanga: పెద్ద హీరోలతో వచ్చే క్యూట్‌ లవ్‌ స్టోరీలు, ఫ్యామిలీ డ్రామాలు ఇప్పుడు చాలా వరకు మిస్‌ అవుతున్నామని దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా అన్నారు. బిగ్‌ స్టార్స్‌ అందరూ ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాల వైపే దృష్టి పెడుతున్నారని చెప్పారు. దీంతో గతంలో పెద్ద హీరోల సినిమాల్లో కనిపించే ప్రేమకథలు, కుటుంబ నేపథ్యంతో కూడిన కథలు తగ్గిపోయాయని అభిప్రాయపడ్డారు.

దర్శకుడిగా మారిన తర్వాత థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూడటం చాలా వరకు తగ్గించుకున్నానని సందీప్‌ రెడ్డి వంగా తెలిపారు. సినిమా మేకింగ్‌పై మాత్రమే తాను దృష్టి పెడతానని, సినిమా బిజినెస్‌, ఇతర వ్యవహారాలను తన అన్నయ్య, నాన్న చూసుకుంటారని చెప్పారు. తనకు సంబంధించినంత వరకు సినిమా రూపొందించడంపైనే పూర్తి శ్రద్ధ ఉంటుందని పేర్కొన్నారు.

Read More డిసెంబర్ రేస్ నుంచి తప్పుకోనున్న ‘ఫౌజీ’?.. రిపబ్లిక్ డే టార్గెట్‌గా కొత్త ప్లాన్

పాన్‌ ఇండియా సినిమాల ట్రెండ్‌ పెరుగుతున్న సమయంలో పెద్ద హీరోలు భారీ స్థాయి కథలు, భారీ బడ్జెట్‌ చిత్రాల వైపు వెళ్తున్నారని, మరోవైపు ప్రేక్షకులు ఇంతకుముందు చూసిన లవ్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఉన్న కథలను కూడా మిస్‌ అవుతున్నారని సందీప్‌ రెడ్డి వంగా వ్యాఖ్యానించారు.

Related Posts