బన్నీ ఫ్యాన్స్ కు షాక్.. పుష్ప-2 విడుదల వాయిదా..?
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీ అప్పట్లో భారీ విజయం సాధించింది. పాన్ ఇండియా సినిమాగా వచ్చి అన్ని భాషల్లో చాలా పెద్ద హిట్ కొట్టింది. దాంతో బన్నీకి నేషనల్ వైడ్ గా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. దానికి సీక్వెల్ గా ఇప్పుడు పుష్ప-2 సినిమా రాబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ భారీ అంచనాలను పెంచేశాయి.
రీసెంట్ గా వచ్చిన సూసేకి అగ్గిరవ్వ మాదిరి సాంగ్ అయితే దేశాన్ని ఊపేస్తోంది. ఈ పాటపై ఇప్పటికే సోషల్ మీడియాలో రీల్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. సినిమా స్టార్లు కూడా ఈ సాంగ్ కు రీల్స్ చేస్తుండటంతో భారీ హైప్ క్రియేట్ అయిపోయింది. అయితే ఈ సినిమా లవర్స్ కు ఇప్పుడు భారీ షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమాను ఆగస్టు 15కు రిలీజ్ చేస్తామని ఇప్పటికే మూవీ టీమ్ ప్రకటించింది. కానీ తాజాగా మూవీ రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మూవీ ఎడిటర్ మారడంతో పాటు వీఎఫ్ ఎక్స్ సరిగ్గా లేదని డైరెక్టర్ సుకుమార్ అసంతృప్తిగా ఉన్నారంట. దాంతో పాటు మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ కాకపోవడంతో మరో నెల రోజులు సమయం పట్టేలా ఉందంట. కాబట్టి సెప్టెంబర్ లో రిలీజ్ చేయడంపై ఆలోచిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.