శ్రీవిద్య సంప్రదాయంలో సమంతకు సీమంత వేడుకలు

శ్రీవిద్య సంప్రదాయంలో సమంతకు సీమంత వేడుకలు

  • భర్త రాజ్ నిడిమోరు, స్నేహితుల సమక్షంలో సమంతకు మంగళస్నానం

Samantha Ruth Prabhu: హీరోయిన్ సమంత శ్రీవిద్య సంప్రదాయంలో ప్రత్యేకంగా సీమంత వేడుకలు జరుపుకున్నారు. శ్రీవిద్య సంప్రదాయంలోని శ్రీకల్పం (కాలా ఆవరణ) కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ వేడుకను నిర్వహించారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సమంతకు భర్త రాజ్ నిడిమోరు, స్నేహితులు మంగళస్నానం చేయించారు. సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వేడుకలో సమంత ప్రత్యేకంగా కనిపించారు. వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

శ్రీవిద్య సంప్రదాయంలో కాబోయే తల్లిని దేవతగా భావిస్తారని సమంత తెలిపారు. ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు. ఈ వేడుక తనకు, తన బిడ్డకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని సమంత తెలిపారు. సంప్రదాయ పద్ధతిలో జరిగిన సీమంత వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు, సినీ ప్రముఖులు సమంతకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Read More 'గజిని' విలన్ ప్రదీప్ రావత్ ఇకలేరు.. అభిమానుల్లో విషాదం

Related Posts