అర్జున్ తన కూతురుకు కట్నం ఎంత ఇచ్చారో తెలుసా..?

అర్జున్ తన కూతురుకు కట్నం ఎంత ఇచ్చారో తెలుసా..?



సీనియర్ హీరో అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన సీనియర్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో అగ్ర నటుడిగా ఎదిగారు. ఇప్పటికే వందకు పైగా సినిమాల్లో నటించిన ఆయన.. ఇప్పుడు దర్శకుడిగా బాగానే సినిమాలు చేస్తున్నారు. 

Read More ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన సైఫ్ అలీఖాన్

అయితే ఆయన కూతురు ఐశ్వర్య కూడా హీరోయిన్ గా చేసింది. ఈ క్రమంలోనే ఆమె తమిళ ఇండస్ట్రీకి చెందిన హీరో ఉమాపతిని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అర్జున్ సర్జా తన కూతురుకు ఎంత కట్నం ఇచ్చారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. 

అర్జన్ ఆస్తి దాదాపు రూ.180 కోట్లకు పైగానే ఉంటుంది. అయితే అర్జున్ తన ఇద్దరు కూతుర్ల పేరు మీద తన ఆస్తిని రాసి ఉంచారట ఎప్పుడో. ఇప్పుడు పెద్ద కూతురుకుబంగారు ఆభరణాలతోపాటు కోటి రూపాయాలకు పైగా విలువైన ఇంటిని కూతురికి బహుమతిగా అందించాడు. ఇక తన కూతురు పేరు మీద ఉంచిన ఆస్తి మొత్తం ఆమె పేరు మీదనే ఉంటుందని తెలుస్తోంది.  

Related Posts