ఆస్ట్రేలియా రోడ్డుపై పూజలా? చేతబడా?: సీసీటీవీలో రికార్డైన వింత ఘటన

ఆస్ట్రేలియా రోడ్డుపై పూజలా? చేతబడా?: సీసీటీవీలో రికార్డైన వింత ఘటన

  • మెల్‌బోర్న్‌లో నడిరోడ్డుపై దీపం ఎందుకు పెట్టారు?.. వైరల్‌ వీడియోపై చర్చ

Australia News: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో నడిరోడ్డుపై ఓ జంట దీపం వెలిగించి పెట్టిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మెల్‌బోర్న్‌ శివారులోని నోస్‌లీ అవెన్యూలో ఆగస్టు 29న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డు మధ్యలో జంట దీపం వెలిగిస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఈ సీసీటీవీ ఫుటేజ్‌ను స్థానికుడైన గుర్జీత్‌ అనే వ్యక్తి వింధామ్‌ టీవీకి అందించినట్లు సమాచారం. నడిరోడ్డుపై దీపం పెట్టిన ఘటన తనను భయాందోళనకు గురిచేసిందని గుర్జీత్‌ పేర్కొన్నాడు. ఈ ఘటన వెనుక ఏదైనా బ్లాక్‌ మ్యాజిక్‌ తరహా ఆచారం ఉందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Read More ఘనంగా ముగిసిన అంతర్జాతీయ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్

అయితే ఆ జంట నడిరోడ్డుపై దీపం ఎందుకు పెట్టిందనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. వీడియోలో కనిపించిన దృశ్యాల ఆధారంగా మాత్రమే దాని ఉద్దేశాన్ని నిర్ధారించడం సాధ్యం కాదు. మరోవైపు ఈ ఘటనపై సోషల్‌ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విదేశాల్లో ఇలాంటి చర్యలతో భారతీయులపై ప్రతికూల అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, అసలు కారణం తెలియాల్సి ఉంది.

Related Posts