శ్రీవారి లడ్డూలో సిల్క్ క్లాత్ ముక్క.. భక్తుడి ఆగ్రహం
శ్రీవారి లడ్డూలో సిల్క్ క్లాత్.. నాణ్యతపై అనుమానాలు
Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో సిల్క్ క్లాత్ ముక్క కనిపించడం కలకలం రేపింది. పరమ పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వస్త్రం ముక్క ఎలా వచ్చిందని భక్తుడు ప్రశ్నించారు. లడ్డూ తయారీ, ప్యాకింగ్ ప్రక్రియలో సిబ్బంది నిర్లక్ష్యం ఏమైనా జరిగిందా? ప్రసాదం నాణ్యతను పరిశీలించే విధానం ఎలా ఉందని ఆయన ప్రశ్నించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ అధికారులు తయారీ, ప్యాకింగ్ ప్రక్రియలను మరింత పర్యవేక్షించాలని భక్తులు కోరుతున్నారు. ఘటనపై టీటీడీ అధికారులు స్పందించి వస్త్రం ముక్క లడ్డూలోకి ఎలా వచ్చిందనే విషయంపై విచారణ జరిపి స్పష్టత ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు.