VIRAL: అర్ధరాత్రి హైవేపై గ్రూప్‌ఫైట్.. కార్లు, కర్రలతో గ్యాంగ్ వార్!  

VIRAL: అర్ధరాత్రి హైవేపై గ్రూప్‌ఫైట్.. కార్లు, కర్రలతో గ్యాంగ్ వార్!  

కర్ణాటకలో కొందరు యువకులు రాత్రివేళ రోడ్డుపై హల్‌చల్ చేశారు. కార్లతో పరస్పరం ఢీకొట్టుకున్నారు. కర్రలతో దాడులు చేసుకున్నారు.

కర్ణాటకలో కొందరు యువకులు రాత్రివేళ రోడ్డుపై హల్‌చల్ చేశారు. కార్లతో పరస్పరం ఢీకొట్టుకున్నారు. కర్రలతో దాడులు చేసుకున్నారు. మే 18న ఉడుపి ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా, ఉడుపి- మణిపాల్ హైవేపై ఈ ఘటన జరిగింది. రెండు కార్లలో వచ్చిన ఆరుగురు యువకులు వీరంగం సృష్టించారు. మొదట ఓ కారు వేగంగా వెనక్కి వచ్చి మరో వాహనాన్ని ఢీకొట్టింది. అందులో నుంచి యువకులు దిగి కర్రలతో కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే కర్ర పట్టుకున్న ఓ యువకుడిని మరో గ్రూప్‌నకు చెందిన కారు ఢీకొట్టడంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు.

Read More పోలీసులపై వైద్యురాలి తల్లితండ్రులు సంచలన ఆరోపణలు

కర్ణాటకకు చెందిన ఓ డాక్టర్ సమీపంలోని అపార్ట్‌మెంట్ నుంచి ఈ ఘటనను వీడియోలో రికార్డ్ చేసి తన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేస్తూ నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

Related Posts