కర్మాన్‌ఘాట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

కర్మాన్‌ఘాట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

  • బైక్‌పై ఉన్న ఇద్దరికీ తలకు తీవ్ర గాయాలు.. ఒకరు అపస్మారక స్థితిలోకి

Karmanghat Accident: హైదరాబాద్ కర్మాన్‌ఘాట్‌లో కారు-బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కర్మాన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్యూక్ బైక్‌పై ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తుండగా.. ముందుగా వెళ్తున్న టాటా పంచ్ కారును వెనుక నుంచి ఢీకొట్టినట్లు సమాచారం. ఢీకొన్న సమయంలో బైక్‌పై ఉన్న ఇద్దరూ రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదంలో ఇద్దరికీ తలకు బలమైన గాయాలు అయినట్లు తెలుస్తోంది. వారిలో ఒకరు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులకు సహాయం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు.

Read More అక్రమంగా నిల్వ చేసిన 16 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

బైక్ నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉండటంతో పాటు అతివేగంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా సమాచారం. అయితే ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. కర్మాన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంతో కొద్దిసేపు స్థానికంగా కలకలం నెలకొంది.