ఆన్‌లైన్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి

ఆన్‌లైన్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి

  • బెట్టింగ్‌లో లక్షన్నర పోగొట్టుకున్న యువకుడు
  • పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
  • ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

ఇటీవల ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ బెట్టింగ్ మాయలో పడి యువత విలువ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. లక్షల్లో డబ్బులు పోగొట్టుకుని మనస్తాపంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. 

ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ధాన్యం అమ్మిన డబ్బులు రూ.లక్షన్నను భాను ప్రకాష్(24) అనే యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పెట్టి నష్టపోయాడు. దీంతోమనస్తాపానికి గురైన యువకుడు ఈనెల 13వ తేదీన పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు అతన్ని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు.

Read More శాంతిభద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్‌..