అన్నమయ్య జిల్లాలో షాకింగ్ ఘటన.. సెలవు కోసం తోటి విద్యార్థిని చంపేందుకు ప్రయత్నం

అన్నమయ్య జిల్లాలో షాకింగ్ ఘటన.. సెలవు కోసం తోటి విద్యార్థిని చంపేందుకు ప్రయత్నం

  • స్కూల్‌కు సెలవు కోసం దారుణం.. చనిపోతే సెలవు ఇస్తారని రూమ్‌మేట్‌పై హత్యాయత్నం

: అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లి మండలం గ్యారంపల్లె గురుకుల పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు సెలవు వస్తుందనే ఉద్దేశంతో 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనతో పాఠశాలలోని విద్యార్థులు, సిబ్బందిలో ఆందోళన నెలకొంది.

రూమ్‌మేట్ చనిపోతే పాఠశాలకు సెలవు ఇస్తారని భావించిన ఇద్దరు విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. రాత్రి సమయంలో బాధిత విద్యార్థి ముఖంపై దిండుతో నొక్కి, అనంతరం గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. తోటి విద్యార్థుల నుంచి తప్పించుకున్న బాధిత బాలుడు వెంటనే పాఠశాల సిబ్బందిని ఆశ్రయించి జరిగిన విషయాన్ని వివరించాడు. దీంతో సిబ్బంది అప్రమత్తమై బాలుడి పరిస్థితిని పరిశీలించారు. ఘటనపై పాఠశాల అధికారులు వివరాలు సేకరించారు.

Read More మాధాపూర్‌లో నిషేధిత ఈ-సిగరెట్ల దందా.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

మైనర్ విద్యార్థులు సెలవు కోసం తోటి విద్యార్థి ప్రాణాలకే ముప్పు తెచ్చే స్థాయికి వెళ్లడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, విద్యార్థుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల మధ్య ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related Posts

Advertisement