ఇండిగో విమానానికి మరోసారి బాంబు బెదిరింపు

ఇండిగో విమానానికి మరోసారి బాంబు బెదిరింపు

ఇండిగో విమానానికి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని ముంబై ఎయిర్ పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అనంతరం విమానాన్ని భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

ఇండిగో విమానానికి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని ముంబై ఎయిర్ పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అనంతరం విమానాన్ని భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఇవి ఫేక్ బాంబు బెదిరింపుగా భద్రత సిబ్బంది నిర్ధారించారు. చెన్నై నుంచి ముంబైకి శనివారం ఉదయం బయల్దేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి. 

చెన్నై నుంచి ముంబై వచ్చిన ఈ విమానంలో మొత్తం 172 మంది ప్రయాణికులు ఉన్నారు.  మరోవైపు ఆ విమానం‌లో బాంబు లేకపోవడంతో చెన్నై‌కు ఆ విమాన సర్వీస్‌ను ఏర్పాటు చేశారు. అందులోభాగంగా విమానాన్ని ఎయిర్ పోర్ట్‌ టెర్మినల్ వద్దకు తీసుకువచ్చారు.  ఇక ఈ వారంలో ఇండిగో విమానానికి ఇది రెండో బాంబు బెదిరింపు అని ఆ సంస్థ గుర్తు చేసింది. గత నెల మే 28వ తేదీ ఢిల్లీ నుంచి వారణాసి బయలుదేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నాగపూర్, జైపూర్, గోవా ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

Read More హైద్రాబాద్ లో  నేషనల్ బడ్డింగ్ ప్రొఫెషనల్ - చెఫ్ కాంపిటీషన్స్ 2024

Related Posts