మహాకవి శ్రీశ్రీ కుమారుడు శ్రీరంగం వెంకట రమణ కన్నుమూత
మహాకవి శ్రీశ్రీ కుమారుడు శ్రీరంగం వెంకట రమణ (59) కన్నుమూశారు. అమెరికాలో నివాసముంటున్న ఆయన గురువారం (జూన్ 7)న అక్కడే తుదిశ్వాస విడిచినట్లు గుంటూరులోని వారి కుటుంబ బంధువు డాక్టర్ రమణ యశస్వి ఒక ప్రకటనలో వెల్లడించారు.
మహాకవి శ్రీశ్రీ కుమారుడు శ్రీరంగం వెంకట రమణ (59) కన్నుమూశారు. అమెరికాలో నివాసముంటున్న ఆయన గురువారం (జూన్ 7)న అక్కడే తుదిశ్వాస విడిచినట్లు గుంటూరులోని వారి కుటుంబ బంధువు డాక్టర్ రమణ యశస్వి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆయన మృతదేహానికి అక్కడే అంత్యక్రియలు పూర్తి చేసినట్లు వివరించారు. శ్రీశ్రీ సతీమణి సరోజకు 80 ఏళ్ల వయసులో పుత్రవియోగం కలగడం పట్ల శ్రీశ్రీ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీరంగం వెంకటరమణ అమెరికాలోని కనెక్టికల్ రాష్ట్రంలో నివాసముంటున్నారు. ఫైజర్ కంపెనీ రీసెర్చ్ విభాగంలో పనిచేస్తున్న ఆయన పాతికేళ్ల క్రితమే అక్కడ స్థిరపడ్డారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య మాధవి పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలోని గణపవరం. వెంకట రమణ పిల్లలు శ్రీనివాసరావు, కవిత చదువుకుంటున్నారు. శ్రీరంగం వెంకట రమణ మరణం పట్ల సాహితీ వేత్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.