హైదరాబాద్, ఒంగోలులో 8 చోట్ల ఈడీ సోదాలు 

హైదరాబాద్, ఒంగోలులో 8 చోట్ల ఈడీ సోదాలు 

హైదరాబాద్, ఒంగోలులో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. చదలవాడ ఇంఫ్రాటెక్ లిమిటెడ్ కంపెనీపై ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్, ఒంగోలులో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. చదలవాడ ఇంఫ్రాటెక్ లిమిటెడ్ కంపెనీపై ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఎస్‌బీఐ బ్యాంకును బ్యాంకును చదలవాడ ఇంఫ్రాటెక్ కంపెనీ మోసం చేసినట్లు సమాచారం. బ్యాంకు నుంచి పొందిన నగదును దారి మళ్లించినట్లు అధికారులు గుర్తించారు.

ఈ మేరకు ఆ కంపెనీ డైరెక్టర్ చదలవాడ రవీంద్రబాబు సహా ఇతరులపై ఏసీబీ, సీబీఐ కేసులు నమోదు అయ్యాయి. ఏసీబీ, సీబీఐ కేసు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నిధులు నేరపూరిత కుట్రలో రూ.166.93కోట్ల మేర మోసం చేసినట్లు గుర్తించారు. బ్యాంకు ఇచ్చిన నిధులతో డైరెక్టర్లు ఇతరులతో కలిసి కుట్ర చేసినట్లు ఈడీ వెల్లడించింది. బ్యాంకు రుణాల నిధులను దుర్వినియోగం చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.

Read More సింగరేణి జాగృతి ఆవిర్భావం : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత