స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ లో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే
On
విశ్వంభర,యాదాద్రి భువనగిరి జిల్లా :- ఆలేరు పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్ట్రీట్ ఫుడ్ ఆహార పదార్థాలను, మహిళలు తయారు చేసిన వివిధ వస్తువులను,స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సందర్శించారు. ఈ సందర్భంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడం లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రజా పాలనలో ముందుకు వెళుతున్నారని,ప్రతి రంగంలో మహిళలకు ప్రతి పథకంలో ఈ ప్రభుత్వంలో పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు



