అబిడ్స్‌లో అక్రమ పేకాట దందా.. సీపీ సీవీ ఆనంద్‌కు బీఆర్ఎస్ నేత ఫిర్యాదు
- గుడి, బడి మధ్యలో పేకాట స్థావరం.
- బీజేపీ నేతపై బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు.
Hyderabad news: హైదరాబాద్ నగరంలోని అబిడ్స్ ప్రాంతంలో అక్రమంగా పేకాట క్లబ్ నిర్వహిస్తున్న వారిపై తక్షణ చర్యలు తీసుకుని ఆ స్థావరాన్ని మూసివేయాలని బీఆర్ఎస్ కాంటెస్టెడ్ ఎంపీ గడ్డం శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అబిడ్స్‌లోని ఇస్కాన్ ఆలయం, ఓ పాఠశాల మధ్య ఉన్న ఇంటిమేట్ క్లబ్లో బేగంబజార్ మాజీ కార్పొరేటర్, జీహెచ్‌ఎంసీ బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ అక్రమంగా పేకాట స్థావరాన్ని నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ కారణంగా పలువురు యువత జీవితాలు దెబ్బతింటున్నాయని, ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం బాధాకరమని విమర్శించారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అండదండలతోనే ఈ పేకాట క్లబ్ కొనసాగుతోందని గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఆలయానికి, విద్యాసంస్థకు సమీపంలో ఈ తరహా కార్యకలాపాలు జరగడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యువత, విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడుతోందని అన్నారు. దీంతో ఆ ప్రాంతంలో ప్రశాంత వాతావరణానికి భంగం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో సంబంధిత ప్రాంగణంలో వెంటనే తనిఖీలు నిర్వహించి, అక్రమ కార్యకలాపాలను అరికట్టాలని, పేకాట క్లబ్‌ను మూసివేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్‌ను గడ్డం శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఈ ఆరోపణలపై పోలీసుల విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.