సిద్దులగుట్టకి ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించండి : మంత్రి పొన్నం కు వినయ్ రెడ్డి విజ్ఞప్తి 

సిద్దులగుట్టకి ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించండి : మంత్రి పొన్నం కు వినయ్ రెడ్డి విజ్ఞప్తి 

WhatsApp Image 2024-07-06 at 4.37.57 PM

 ఆర్మూర్ పట్టణంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం నవనాథ సిద్ధులగుట్టకి  ప్రతి సోమవారం భక్తులు ఎక్కువగా వస్తుండటం వలన గుట్ట పైకి వచ్చే భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్నయని గుట్ట పైకి బస్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని ఆలయ కమిటీ సభ్యులు, మరియు భక్తుల విజ్ఞప్తి మేరకు  ఈరోజు 
ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి రవాణా శాఖ మంత్రి  పొన్నాం ప్రభాకర్ ను కలిసి సిద్దులాగుట్ట పైకి ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.దీనిపై స్పందించిన మంత్రి త్వరలో నే సిద్దుల గుట్ట పైకి ఆర్టీసీ బస్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు .అలాగే ఆర్మూర్ పట్టణంలోని బస్ డిపో లో బస్ ల కొరత ఉందని, దీనితో నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆర్మూర్ డిపోకు కొత్త బస్ లను  మంజూరు చేయాలనీ చేయాలని కోరడం జరిగింది అని త్వరలోనే కొత్త బస్ లను మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని వినయ్ రెడ్డి పేర్కొన్నారు

Read More మహాపడిపూజ మహోత్సవంలో చిమ్ముల గోవర్ధన్ రెడ్డి