ఢిల్లీలో నిరసన పేరుతో హింసాత్మక ఘటనలు దుర్మార్గపు చర్య

  • * విద్యార్థుల ముసుగులో అల్లరి మూకల దుశ్చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పు
  • * బిజెపి కందుకూరు మండలం అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి

విశ్వంభర , మహేశ్వరం :  దేశ రాజధాని ఢిల్లీలో నిరసనల పేరుతో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలు అత్యంత హేయమైన చర్య అని బిజెపి కందుకూరు మండల అధ్యక్షులు నిమ్మ అంజిరెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది అని అయితే ఆ హక్కును అడ్డుపెట్టుకుని ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం, పోలీసులపై దాడులకు పాల్పడటం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం ఏమాత్రం సమర్థనీయం కాదని అన్నారు. విద్యార్థుల ముసుగులో కొందరు అల్లరి మూకలు హింసకు పాల్పడుతూ ప్రజాస్వామ్య విలువలను అవమానించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని సమస్యలపై చర్చించాల్సిన యువతను రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టి, హింసాత్మక ఘటనలకు ప్రేరేపించడం దేశ భవిష్యత్తుకు మంచిది కాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయవచ్చు, నిరసనలు తెలియజేయవచ్చు. కానీ నిరసన పేరుతో హింసకు పాల్పడటం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం మాత్రం ప్రజాస్వామ్య హక్కు కాదని ఇలాంటి ఘటనలను రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. దేశ రాజధానిలో శాంతిభద్రతలను కాపాడటం ప్రభుత్వ బాధ్యత. అదే సమయంలో ప్రతి పౌరుడు చట్టాన్ని గౌరవిస్తూ శాంతియుత మార్గాల్లో తన నిరసనను వ్యక్తం చేయాలి. హింసను ప్రోత్సహించే శక్తులను ప్రజలు గుర్తించి తిరస్కరించాలన్నారు. దేశంలో శాంతి, భద్రత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. హింసకు తావులేని, చర్చలు మరియు రాజ్యాంగబద్ధమైన మార్గాలే ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అవుతుందని పేర్కొన్నారు.

🕒 23 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-violence-in-the-name-of-protest-in-delhi-is/article-19364

Tags: