పంతులు మధుబాబు కు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 

పంతులు మధుబాబు కు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 

విశ్వంభర, యాదాద్రి భువనగిరి జిల్లా :- డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు, ఈ నేపథ్యంలో భూదాన్ పోచంపల్లి మండలం , ముక్తపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ లో విద్య బోధన చేస్తున్న పంతులు మధుబాబు కు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం కలెక్టర్ హనుమంత రావు చేతుల మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో అందుకున్నారు. ఈ సందర్బంగా ఆయన విశ్వంభర దిన పత్రికతో మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం రావడం చాల సంతోషముగా ఉందని అన్నారు.  దివంగత పంతులు సైదులు మా నాన్నగారు మాకు ఇచ్చిన స్వేచ్ఛ , స్ఫూర్తి , ధైర్యం , మా భవిశ్యత్తు కోసం నిరంతరం ఆయన చేసిన త్యాగం వెల కట్టలేనిది. ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయని వాటన్నిటిని అధిగమించి విద్యార్థుల భవిష్యత్తుకై నిరంతరం తపన పడుతామని అన్నారు. ప్రతి విద్యార్థిని జీవిత లక్ష్యాలకు  చేర్చడంలో  ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మాపై ఎంతో భాద్యత ఉంటుందని అన్నారు. నిరుపేద తల్లితండ్రులు కలల్ని , ఆశయాలను నెరేవేర్చే విధంగా విద్యార్థులను  ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం నిరంతరం చేస్తామని అన్నారు. ఎక్కడ పని చేసిన కూడా అక్కడ నా విద్యార్థులను ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తానని అన్నారు. ఈ అవార్డు రావడం పట్ల నా సతీమణి నిర్మల సహకారం , మా అమ్మ ఆశీస్సులు మరువలేనిది.  ఈ అవార్డు రావడం పట్ల ముక్తాపూర్ గ్రామా పెద్దలు , ప్రజాప్రతి నిధులు , తోటి సిబ్బంది , అధికారుల సహకారం ఉందని అన్నారు. మిత్రులు , సన్నిహితులు , గ్రామస్థులు హర్షం వ్యక్తం చేసారు. 

 

Read More సోనిపట్‌లో ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ పై కేటీఆర్ ప్రసంగం

Tags: