పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు దొరకడనే జనసేనలో చేరా: నాదెండ్ల మనోహర్
- పవన్‌కు అండగా లేకపోతే మన కాంట్రిబ్యూషన్ జీరో: నాదెండ్ల
Nadendla Manohar: పవన్ కళ్యాణ్ నాయకత్వంపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు దొరకడం కష్టమనే భావనతోనే తాను జనసేన పార్టీలో చేరానని తెలిపారు. అలాంటి నాయకుడికి అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న నాదెండ్ల మనోహర్.. పవన్ కళ్యాణ్‌కు అండగా నిలవడంలో ప్రతి ఒక్కరి పాత్ర ముఖ్యమని అన్నారు. నాయకుడికి అండగా లేకపోతే మన కాంట్రిబ్యూషన్ జీరో అవుతుందని, అందుకే తాను జనసేనలోకి వచ్చానని చెప్పారు.
పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై సూచనలు చేయడంలో తప్పు లేదని నాదెండ్ల మనోహర్ అన్నారు. అయితే చాలామందికి పూర్తి సమాచారం తెలియక రకరకాలుగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఏదైనా సూచన లేదా అభిప్రాయం ఉంటే దానిని సరైన వేదికపై చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. జనసేన నాయకత్వంపై విశ్వాసంతో ముందుకు సాగుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అంతర్గత అంశాలపై మాట్లాడేటప్పుడు సరైన వేదికను ఉపయోగించుకోవాలని సూచించారు.



