బచ్చన్న యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ వినాయకుడు
On
విశ్వంభర, లాల్ దర్వాజా :- బచ్చన్న యూత్ అసోసియేషన్ ఇన్సైడ్ లాల్ దర్వాజా చాపల గల్లీలో 1978లో ఒక్క ఫీట్ తో మొదలై ప్రస్తుతం 18 సీట్లతో నెలకొల్పామని తెలిపారు. 1982లో సీనియర్ ఎన్టీఆర్ ఈ విగ్రహాన్ని దర్శించుకోవడం కూడా ఒక ప్రాముఖ్యత గా చెప్పుకోవచ్చు, ఈ యొక్క వినాయక మంటపానికి 25 సంవత్సరాల సెలబ్రేషన్ కూడా నిర్వహించామని ప్రెసిడెంట్ సిహెచ్ ప్రభు తెలిపారు. మా గణేష్ మండపం దగ్గర మహా హారతి, మంగళహారతులు,భజనలు,జాగరణ, అన్నదానం,నిత్య పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ పార్టీల నాయకులు కూడా ఈ యొక్క వినాయకుని దర్శించుకోవడం జరిగిందని తెలిపారు. సభ్యులు ఏ వినోద్ కుమార్, హరికృష్ణ, ఏ కవిన్, మధు యాదవ్, భాస్కర్ గౌడ్, గురు, ఏ కిరణ్ కుమార్, ఆర్కే రాజు, ఠాకూర్ సింగ్, ఎస్ గుండు ఇంకా కమిటీ సభ్యులు బస్తి వాసులను సహాయ సహకారాల తో ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నామని తెలిపారు



