నా ఇన్సూరెన్స్ డబ్బులతో డాడీకి చికిత్స చేయించు.. సూసైడ్ నోట్ రాసి ఏఎన్‌ఎం ఆత్మహత్య
- నెల్లూరు జిల్లాలో ఏఎన్‌ఎం సాయి చందన ప్రియ ఆత్మహత్య.
- సచివాలయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన.
- సూసైడ్ నోట్‌లో ఇన్సూరెన్స్ డబ్బుతో తండ్రికి చికిత్స చేయించాలని విజ్ఞప్తి.
Nellore News: నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తోనుకుమల గ్రామ సచివాలయంలో ఏఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న సాయి చందన ప్రియ (27) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. సచివాలయంలో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో లభ్యమైన సూసైడ్ నోట్‌లో తల్లికి క్షమాపణలు చెబుతూ, తన పేరుపై రూ.60 లక్షల డెత్ ఇన్సూరెన్స్ ఉందని, ఆ డబ్బుతో అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి రమణయ్యకు చికిత్స చేయించాలని కోరినట్లు పేర్కొన్నారు. అలాగే తన అక్కను ఉద్దేశించి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని రాసినట్లు సమాచారం. కొంతకాలంగా చెన్నైలో చికిత్స పొందుతున్న తండ్రి ఆరోగ్య పరిస్థితి కారణంగా ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.