తెలంగాణ బీసీ ‘ఏ’ కులాలకు అన్యాయం చేయొద్దు.. పరిరక్షణ సమితి డిమాండ్

  • బీసీ ‘ఏ’ జాబితాలో మార్పులపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు
  • బీసీ ‘ఏ’ కులాల హక్కులను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

Telangana BC News: తెలంగాణలో బీసీ ‘ఏ’ కులాల జాబితాలో మార్పులు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీసీ ‘ఏ’ కులాల పరిరక్షణ సమితి ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమితి ప్రతినిధులు మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో జీవో నెం.16 ద్వారా తెలంగాణలో లేని 26 బీసీ కులాలను జాబితా నుంచి తొలగించిందని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఆ కులాలను మళ్లీ బీసీ ‘ఏ’ జాబితాలో చేర్చేందుకు కాకుండా, స్థానం కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికే తెలంగాణలోని బీసీ ‘ఏ’ కులాలు విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల్లో వెనుకబడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, కొన్ని కులాలు ఇప్పటికీ బిక్షాటనతో జీవనం సాగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 30న సుప్రీంకోర్టులో విచారణకు రానున్న బీసీ ‘ఏ’ కులాల కేసులో రాష్ట్ర బీసీ కమిషన్ వాస్తవ పరిస్థితులను తెలియజేస్తూ సరైన ప్రతిపాదనలు సమర్పించి తెలంగాణ బీసీ ‘ఏ’ కులాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

🕒 22 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/do-not-do-injustice-to-telangana-bc-a-castes-demand/article-19225

Related Posts