సోదర భావంతో మొహరం పండుగ జరుపుకోవాలి: చిలుక ఉపేందర్ రెడ్డి

7
విశ్వంభరా, ఎల్బీనగర్ జూలై 16 :- సోదరభావంతో మొహరం పండుగను జరుపుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ  ముస్లింలకు  మోహరం పండుగ శుభాకాంక్షలు  తెలిపారు. మొహర్రం పండుగ త్యాగానికి, స్ఫూర్తికి ప్రతీక అని, విశ్వాసం, నమ్మకం కోసం మహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమామ్ హుస్సేన్ చేసిన బలిదానాన్ని గుర్తు చేసుకోవటమే మొహరం పండుగ ప్రత్యేకతని అన్నారు. మానవజాతి త్యాగం ఎంతో గొప్పదని మంచితనం, త్యాగాన్ని గుర్తు చేసుకోవటమే ఈ పండుగ యొక్క ప్రత్యేకతని   పేర్కొన్నారు.