రద్దీ ఎక్కువ బస్సులు తక్కువ.!
విశ్వంభర న్యూస్ షాద్ నగర్ : - రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగింది. ఏ బస్సు లో చూసినా ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటోంది.ఈ నేపథ్యంలో బస్సుల కోసం ప్రయాణికులతో పాటు విద్యార్థులు అనేక ఇబ్బందులకుగురవుతున్నారు.విద్యారంగం అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామంటూ ప్రకటనలు చేయడమే తప్పా విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో శ్రద్ధ వహించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత చదువుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాలంటే పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. కేశంపేట మండలంలోని పరిసర ప్రాంతాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు చదువుకుంటున్నారు.లే మామిడి,కేశంపేట్,వేముల నర్వ,ఇప్పలపల్లి, పాపరెడ్డి గూడ గ్రామాల నుండి షాద్ నగర్ కు వెళ్లడానికి సమయానికి ఆర్టీసీ బస్సులు లేవని పరిసర ప్రాంతాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు అంటున్నారు.ఉదయం నుంచి బస్సుల కోసం ఎదురు చూడడం తీరా బస్సులు వస్తే రద్దీగా ఉండడంతో ఆర్టీసీ డ్రైవర్లు బస్సులను గ్రామాల్లో ఆపడం లేదని దీనితో కొంతమంది విద్యార్థులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు.మేము సకాలంలో కళాశాలలకు చేరుకోలేకపోతున్నామని తెలియజేస్తున్నారు.
మరి కొందరు విద్యార్థులు ప్రమాదమని తెలిసినా తప్పని స్థితిలో పుట్ బోర్డు పై నిలబడి గ్రిల్స్ పట్టుకుని రాకపోకలు కొనసాగింస్తున్నారు.వేలాడతూ వెళ్లడం వల్ల పొరపాటున పట్టు తప్పితే ప్రమాదం బారినపడక తప్పదు.దీంతో ఉదయం 8 గంటల నుంచి విద్యార్థులు మెయిన్ రోడ్డుకు చేరుకుంటారు.ఆ సమయం లో ఉన్న బస్సులు కూడా కిక్కిరిసిన ప్రయాణికులతో వస్తుండడంతో బస్సులు ఆపకపోవడంతో ఆర్థిక భారమైనా ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్ టి సి అధికారులు స్పందించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బస్సులను నడపాలని విద్యార్థుల షాద్ నగర్ బస్సు డిపో వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు