ఆత్మకూరు (ఎం) మెయిన్ రోడ్ నుండి సబ్ మార్కెట్ వరకు డబల్ రోడ్డు నిర్మించాలి

సిపిఎం మండల కార్యదర్శి వేముల బిక్షం

WhatsApp Image 2024-07-22 at 16.34.41_1026f22fవిశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 22 :  - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని మోత్కూర్ - భువనగిరి ప్రధాన రహదారి నుండి సబ్ మార్కెట్ వరకు గుంతలతో కూడిన చిన్న రోడ్డు ఉండడంతో పలు సమస్యలపై మండల కేంద్రానికి వచ్చే ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రధాన మెయిన్ రోడ్డు నుంచి సబ్ మార్కెట్ వరకు డబుల్ రోడ్డును ఏర్పాటు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి వేముల బిక్షం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల కేంద్రంలోని అంగడి (సంత)లో మండల కేంద్రంలో డబల్ రోడ్డు నిర్మించాలని సిపిఎం పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి వేముల బిక్షం మాట్లాడుతూ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పై బీటీ రోడ్డు దెబ్బతిని కంకర తేలి, అన్ని గుంతలు ఏర్పడి గుంతలలో నీళ్లు నిలిచిపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సోమవారం మండల కేంద్రంలో జరిగే అంగడి (సంత) లో కూడా అన్ని గుంతలు ఏర్పడ్డాయని, అంగడిలో సులబ్ కాంప్లెక్స్ (మరుగుదొడ్లు) లేక దూరప్రాంతాల నుంచి వచ్చే మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మరుగుదొడ్లు నిర్మించాలని, మంచినీటి వసతి ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మండల కేంద్రంలో డబల్ రోడ్డును ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వంలోఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేదని, ఈప్రభుత్వమైన వెంటనే స్పందించి మండల కేంద్రంలో డబల్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని సిపిఎం పార్టీమండల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు తుమ్మల సత్యనారాయణ రెడ్డి, గుణబోయిన స్వామి, నార్కట్పల్లి ఆగయ్య, బట్టు వీరయ్య, మధుసూదన్, ఎం. పుల్లయ్య, టి. అంజయ్య, ఆర్. సాయి, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.