సీఎం రేవంత్‌రెడ్డి విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది

  • శంషాబాద్‌లో ల్యాండింగ్‌కు క్లియరెన్స్ లేక గాల్లోనే చక్కర్లు కొట్టిన సీఎం విమానం.
  • వాతావరణం కారణంగా ఆలస్యమైన ల్యాండింగ్.. సురక్షితంగా చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.

Telangana CM RevanthReddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో 6E717 విమానానికి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వెంటనే ల్యాండింగ్ క్లియరెన్స్ లభించలేదు.

దీంతో పైలట్ విమానాన్ని తిరిగి పైకి ఎగరేసి సుమారు 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టించారు. అనంతరం వాతావరణ పరిస్థితులు మెరుగుపడటంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ల్యాండింగ్‌కు అనుమతి లభించింది. తర్వాత విమానం శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో విమానంలోని ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగానే ఈ ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది.

Read More హుస్నాబాద్ వైశ్య భవన్‌లో ఘనంగా గోరింటాకు వేడుకలు

🕒 30 Jul 2026 ✍️ Desk

సీఎం రేవంత్‌రెడ్డి విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది

Telangana CM RevanthReddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో 6E717 విమానానికి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వెంటనే ల్యాండింగ్ క్లియరెన్స్ లభించలేదు.

దీంతో పైలట్ విమానాన్ని తిరిగి పైకి ఎగరేసి సుమారు 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టించారు. అనంతరం వాతావరణ పరిస్థితులు మెరుగుపడటంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ల్యాండింగ్‌కు అనుమతి లభించింది. తర్వాత విమానం శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో విమానంలోని ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగానే ఈ ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది.

🔗 https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddys-plane-narrowly-missed-an-accident/article-20228