‘మిస్ యూ’ అంటూ సరికొత్త సినిమాతో వచ్చేస్తున్న సిద్ధార్థ్‌

‘మిస్ యూ’ అంటూ సరికొత్త సినిమాతో వచ్చేస్తున్న సిద్ధార్థ్‌

బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నెనొద్దంటానా వంటి సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు హీరో సిద్ధార్థ్. తెలుగు, తమిళ సినిమాల్లో తన నటనతో మెప్పించాడు.

బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నెనొద్దంటానా వంటి సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు హీరో సిద్ధార్థ్. తెలుగు, తమిళ సినిమాల్లో తన నటనతో మెప్పించాడు. చాలా కాలం తర్వాత ‘చిన్నా’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా విడుదలైన అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 

సిద్ధార్థ్ ఆ తర్వాత కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటింగ్ మూవీ ‘ఇండియన్ 2’ సినిమాల్లో నటిస్తున్నాడు. తాజాగా సిద్దార్థ్ తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. సిద్దూ తాజా చిత్రం 'మిస్ యూ'. ఈ సినిమాకు ఎన్‌.రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. కరుణాకరన్, బాల, సాస్తిక రాజేంద్రన్ తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను ఇవాళ (గురువారం)  విడుదల చేశారు. ఈ మేరకు తమిళ్ హీరో శివ కార్తికేయన్ ఎక్స్ వేదికగా మిస్ యూ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశాడు. రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్‌పై సిద్దార్థ్ నడుస్తున్న పోస్టర్‌ కొత్తగా ఉంది. చాలా రోజుల తర్వాత సిద్దార్థ్ మంచి లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ ఫస్ట్ లుక్‌ను మరో హీరో మాధవన్ కూడా రిలీజ్ చేశాడు. 7 మైల్స్ పర్ సెకండ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శామ్యూల్ మాథ్యూ మిస్ యూ సినిమాను నిర్మిస్తున్నారు.

Related Posts