బాబీ-బాలయ్య మూవీ గ్లింప్స్ అదుర్స్.. ఊర మాస్ పాత్రలో బాలయ్య..!

బాబీ-బాలయ్య మూవీ గ్లింప్స్ అదుర్స్.. ఊర మాస్ పాత్రలో బాలయ్య..!

నేడు సోమవారం నాడు నటసింహం బాలయ్య బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత వచ్చిన ఆయన మొదటి పుట్టిన రోజు ఇది. దాంతో ఇండస్ట్రీలో, రాజకీయాల నుంచి ఆయనకు చాలా మంది విషెస్ తో పాటు ప్రత్యేక గిఫ్ట్ లను ప్లాన్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయనకు డైరెక్టర్ బాబీ మూవీ నుంచి మరో అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. బాలయ్య-బాబీ కాంబినేషన్ లో 109వ చిత్రం ‘NBK109’తో పవర్ ఫుల్ సినిమా వస్తోంది. అయితే ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నుంచి తాజాగా బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. 

Read More ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన సైఫ్ అలీఖాన్

ఇందులో “జాలి, దయ, కరుణ లాంటి పదాలకు అర్థం తెలియని అసురుడు” అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో బాలకృష్ణ పాత్రను పరిచయం చేసిన తీరు అద్భుతంగా ఉంది. మాస్ ప్రేక్షకులకు ఏం కావాలో అన్నీ ఇందులో ఉన్నాయి. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ కామెంట్లు పెడుతున్నారు.