Viral Video: హెలికాప్టర్‌ కూలిపోవడానికి ముందు ఇరాన్ అధ్యక్షుడి వీడియో..!

Viral Video: హెలికాప్టర్‌ కూలిపోవడానికి ముందు ఇరాన్ అధ్యక్షుడి వీడియో..!

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాదానికి ముందు విదేశాంగమంత్రితో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ముచ్చటిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాదానికి ముందు విదేశాంగమంత్రితో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ముచ్చటిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అజర్ బైజాన్ సరిహద్దులో ఆదివారం సాయంత్రం ఓ డ్యామ్‌ను ప్రారంభించిన ఇబ్రహీం రైసీ తిరిగి హెలీకాప్టర్‌లో బయల్దేరారు. ఈ క్రమంలో భారీ వర్షం, పొగమంచు కారణంగా ప్రతికూల వాతావరణం ఏర్పడింది.

దీంతో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత దానితో సంబంధాలు తెగిపోయాయి. దాదాపు 16 గంటల అన్వేషణ తర్వాత హెలికాప్టర్ శిథిలాలను ఓ పర్వత శిఖరంపై గుర్తించారు. ఆ తర్వాత హెలికాప్టర్ కుప్పకూలడంతో అధ్యక్షుడు రైసీ, విదేశాంగ మంత్రి హొసైన్ ఆమిర్-అబ్దొల్లాహియన్‌తోపాటు మరో 8 మంది అధికారులు దుర్మరణం పాలయ్యారు. 

Read More పాక్‌ దాడులకు దీటుగా జవాబిద్దాం

Related Posts